దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యంకు తోడు పొగమంచు కూడా ఉండడం కారణంగా ఎయిర్ క్వాలిటీ అత్యంత తీవ్రస్థాయికి పడిపోయింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు.
కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఒక టేబుల్ ను పోస్ట్ చేశారు. “ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. రెండో అత్యంత కాలుష్య నగరం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా తో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా, కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని విమర్శించారు. నవంబరు నుండి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదని ఇక మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?” అని అభిప్రాయపడ్డారు.
నగరాన్ని నేడు కూడా పొగమంచు కమ్మేసింది. దీంతో ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్కు దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వరుసగా రెండోరోజు అరెంజ్ ఆలర్ట్ కొనసాగుతోంది. వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టడంలో అలసత్వం పై ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. తమకు చెప్పకుండా ఆంక్షలు సడలించొద్దని ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో జీఆరపీ-4 లెవల్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
Previous Articleస్పేస్ఎక్స్ తో కలిసి కీలక శాటిలైట్ ను ప్రయోగించిన ఇస్రో
Next Article మహారాష్ట్ర – జార్ఖండ్ లో రేపే పోలింగ్ …!