కుటుంబ,ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఒక్కోసారి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడుతుంటాం.మనకు కావాల్సినంత రుణాలు తెచ్చుకుంటాం.గోల్డ్ లోన్స్‌ను ప్రతి ఒక్క సామాన్యుడు ఎంతగానో నమ్ముతుంటాడు.తమ బంగారాన్ని బ్యాంకుల్లో దాచి పెడుతుంటాడు.ఈ రుణాలను ప్రస్తుతానికి వాయిదాల్లో చెల్లించే సదుపాయం లేదు.అయితే త్వరలోనే బంగారం రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు సమాచారం.ఈ రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బంగారం విలువను కట్టే విషయంలో లోపాలు,వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి వెలుగుచూశాయి. వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలా మంది అవలంబిస్తున్నట్లు గుర్తించింది.ఈ క్రమంలోనే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కూడా నెలవారీ వాయిదాల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ ఇటీవల తమ సర్క్యులర్‌లో వెల్లడించినట్లు సంబంధిత కథనాలు పేర్కొన్నాయి.