దేశంలోని 56వ టైగర్ రిజర్వ్ గా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని గురు ఘాసిదాస్- తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటివరకు ఛత్తీస్ ఘడ్ లో మూడు టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి.బీజాపూర్ లోని ఇంద్రావతి , గరియాబంద్ లో ఉదంతి సీతానది మరియు బిలాస్పూర్ జిల్లాలోని అచానక్ లలో మొత్తం మూడు టైగర్ రిజర్వ్ లు మాత్రమే ఉండగా..ఇప్పుడు ఈ గురు ఘాసిదాస్-తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ గుర్తింపుతో ఛత్తీస్ ఘడ్ లో మొత్తం నాలుగు టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్ 2800 చ.కి.మీ పైగా విస్తరించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ మరియు అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్ తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా నిలిచింది.
ఇక పులుల సంరక్షణలో భారతదేశం కొత్త మైలురాళ్లను సాధిస్తున్న సందర్భంలో, ఛత్తీస్‌గఢ్‌లో గురు ఘాసీదాస్-తమోర్ పింగ్లాను 56వ పులుల రిజర్వ్‌గా ప్రకటించినట్లు గురు ఘాసీదాస్-తమోర్ పింగ్లా పులుల రిజర్వ్ 2,829 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉందని కేంద్ర మంత్రి భూపేందర్ తెలిపారు. మానవులు మరియు జంతువులు సామరస్యంగా నివసించే హరిత భవిష్యత్తు కోసం భారత్ నిరంతరం కృషి చేస్తోందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.
దేశంలోని 56వ టైగర్ రిజర్వ్ గా ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రంలోని గురు ఘాసిదాస్- తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్
By admin1 Min Read