వయనాడ్ లోక్ సభకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఉపఎన్నికలో ఆమె 4 లక్షల ఓట్ల మెజార్టీతో ఆమె ఘన విజయాన్ని అందుకున్నారు.
ఈసందర్భంగా ఆమె తన విజయంపై ప్రియాంక స్పందించారు. వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. వారు తన పట్లఉంచిన నమ్మకానికి హార్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రజలదేనని అన్నారు. పార్లమెంట్ లో మీ గొంతుకనై వయనాడ్ గళం వినిపించేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 25 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లోక్ సభలోకి అడుగుపెట్టి ఎంపీగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండటం గమనార్హం. ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్ సభలో, సోనియాగాంధీ రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక లోక్ సభలోకి రాబోతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు