ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 855 పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. వీటిలో 35 ప్రాథమిక, 27 ప్రాథమికోన్నత, 658 మాధ్యమిక, 135 మాధ్యమికోన్నత పాఠశాలలున్నట్లు చెప్పారు. ఆయన తాజాగా లోక్ సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.1,056.44 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. కేంద్ర వాటా రూ.633.88 కోట్లలో రూ.293.66 కోట్లు ఈ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు