రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్వల్ప అస్వస్థతకు గురతయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఛాతీనొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దాంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సీనియర్ వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని..ఇది అత్యవసర చికిత్స కాదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
2018లో ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
2021తో ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ..కేంద్రం మరో మూడేళ్ల ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది.ఈ క్రమంలోనే వచ్చే నెల 10వ తేదీతో పదవీ కాలం ముగియనుంది.బ్యాంకింగ్ రంగంలో ఆయన చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం మరోమూడేళ్లు ఆయన్నే ఆర్బీఐ గవర్నర్గా కొనసాగించాలని భావిస్తుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి.అదే కనుక నిజమైతే ఆ పదవీలో అత్యధిక కాలం కొనసాగిన వ్యక్తిగా ఆయన రికార్డు అందుకుంటారు.