రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2021-22 నుండి 2023-24 మధ్యకాలంలో వివిధ ఎకౌంటుల కింద విడుదల చేసిన నిధుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణకు రూ.1.22 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.1.48 లక్షల కోట్లకుపైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదనపు కేంద్ర సాయం, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టులు, ప్రత్యేక సాయం కింద ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తాజాగా లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు.
ఆర్థిక సంఘం నిధులు ఏపీకి రూ.44,156 కోట్లు, తెలంగాణకు రూ.8,133 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పధకాలలో ఏపీకి రూ.42,069 కోట్లు, తెలంగాణాకు రూ.39,736 కోట్లు, కేంద్ర విభాగ పథకాలు రూ.36,338 కోట్లు, తెలంగాణాకు రూ.69,729 కోట్లు, ప్రత్యేక సాయం కింద ఏపీకి రూ.15,644 కోట్లు, మూలధన వ్యయం కింద ఏపీకి రూ.10,696 కోట్లు, తెలంగాణాకు రూ.4,662 కోట్లు. మొత్తంగా చూస్తే ఏపీకి రూ.1,48,956 కోట్లు, తెలంగాణాకు రూ.1,22,260 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు