అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ బీఎస్ఈలో 105 పాయింట్లు కోల్పోయి 80,004 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 27పాయింట్లు కోల్పోయి 24,194 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.33గా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, జే.ఎస్.డబ్ల్యూ, టీ.సీ.ఎస్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleఏపీ, తెలంగాణకు వివిధ ఎకౌంటుల కింద కేంద్రం విడుదల చేసిన నిధులు
Next Article రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్:డిసెంబర్ 20న పోలింగ్