ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి – అదానీ మధ్య జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు,1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఏపీసీసీ చీఫ్ షర్మిల వినతి పత్రం అందజేశారు. ఈ డీల్ “అదానీ కి లాభం – రాష్ట్ర ప్రజలకు పెను భారం”. రూ.1.99 పైసలకు దొరికే విద్యుత్ ను రూ.2.49 పైసలకు కొన్నారు. అన్ని చార్జీలు కలుపుకుంటే యూనిట్ ధర 5 రూపాయలకు పైమాటేనని షర్మిల అనంతరం మండిపడ్డారు.
ఇదే ధరతో 25 ఏళ్లకు డీల్ అంటే ఈ తరంతో పాటు రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని దుయ్యబట్టారు. లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీకి దోచి పెట్టినట్లే. అనాడు ప్రతిపక్షంలో తెలుగు దేశం పార్టీ ఇదో పెద్ద కుంభకోణం అంటూ ఆందోళనలు చేసింది. వెంటనే ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎందుకు సైలెంట్ అయ్యారని సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. అదానీకి భయపడుతున్నారా ? మోడీకి భయపడుతున్నారా ? చర్యలకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ? విచారణ చేపట్టేందుకు మనసు రావడం లేదా ? లేక అదానీతో మీరు ములాఖత్ అయ్యారా ? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోయింది. ప్రపంచం మొత్తం ముడుపుల మీద చర్చిస్తుంది. అదానీ దేశం పరువు తీస్తే, జగన్ గారు రాష్ట్ర పరువు తీశారని విమర్శించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని JPC వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్న ఆమె రాష్ట్రంలో సైతం దర్యాప్తు చేపట్టాలని, వెంటనే అదానీతో చేసుకున్న డీల్ ను రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.
ఈ డీల్ “అదానీ కి లాభం – రాష్ట్ర ప్రజలకు పెను భారం: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read