ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమి భారీ విజయం నమోదు చేసి అధికారం దక్కించుకుంది. బీజేపీ 132 స్థానాలలో, షిండే శివసేన 57 స్థానాలలో, అజిత్ పవార్ ఎన్.సీ.పీకి 41 స్థానాలలో గెలుపొందాయి. మహా వికాస్ అఘాడీ కూటమిగా కాంగ్రెస్ (16), ఉద్ధవ్ ఠాక్రే శివసేన(20), శరద్ పవార్ ఎన్.సీ.పీ (10) కలిసి పోటీ చేశాయి.
కాగా, మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వ్యక్తిగతంగా వచ్చి తమ అనుమానాలను వివరిస్తామని తెలిపింది. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు డిసెంబర్ 3న రావాలని పేర్కొంటూ ఎన్నికల సంఘం కాంగ్రెస్ ను ఆహ్వానించింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని కాంగ్రెస్ అనుమానాలు విన్న అనంతరం రాత పూర్వకంగా సమాధానమిస్తామని ఈసీ తెలిపింది.
Previous Articleఅఖిల భారత డైరెక్టర్ జనరల్స్, ఇన్స్పెక్టర్ జనరల్స్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ
Next Article ‘ఫెంజల్’ తుఫాను పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష