రాజస్థాన్లో జరిగిన 51వ జెమ్ అండ్ జ్యూయలరీ అవార్డు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…తాము నిజాయితీగానే ఉన్నామని..నిబద్ధతతోనే వ్యాపారం చేస్తున్నామని గౌతమ్ అదానీ అన్నారు.అమెరికాలో తన కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద గౌతమ్ అదానీ తొలిసారిగా స్పందించారు.ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం ఇదేం కొత్త కాదని..మా మీద దాడి జరిగిన ప్రతీసారి మేము మరింత బలంగా వస్తామని ఆయన అన్నారు.ప్రతీ దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుంది.ప్రతీ అవరోధం అదానీ గ్రూప్‌ను మరింత ధృఢంగా ఎదుర్కొని…ఎక్కువగా ఎదిగేందుకు తోడ్పడుతుందని అదానీ వ్యాఖ్యానించారు.
Previous Articleతీరాన్ని తాకిన ‘ఫెంజల్’ తుఫాను
Next Article హైబ్రిడ్ మోడల్ కు పాక్ అంగీకారం..!