రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.సంక్రాంతి తర్వాత అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని తెలిపారు.అయితే నేరుగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు వేస్తామని వెల్లడించారు.మా నాయకురాలు సోనియా గాంధీ గ్యారంటీగా తాను మాటిస్తున్నాననంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఈ మేరకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.
మారీచుల మాయమాటలు నమ్మొద్దు అని అన్నారు.
కాగా ‘రైతు భరోసాపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు.అసెంబ్లీలో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తాం…రూ.2లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో, రైతు భరోసా కూడా అదేవిధంగా అమలు చేస్తామని చెప్పారు. రూ.7లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ తమకు ప్రభుత్వాన్ని అప్పగించారు.ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉందని కేసీఆర్,హరీశ్‌రావు, అధికారులు ఎవరూ చెప్పలేదని వ్యాఖ్యానించారు.