బిట్ కాయిన్ విలువ దూసుకుపోతోంది. తాజాగా ఈ క్రిప్టోకరెన్సీ విలువ 1,00,000 (లక్ష) డాలర్లు దాటింది. ఇటీవల అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడం కూడా బిట్ కాయిన్ విలువ పెరిగేందుకు దోహదం చేసింది. క్రిప్టో కరెన్సీ పై నిబంధనల సడలింపు పై ట్రంప్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇది 1,00,000 డాలర్ల మార్కు దాటింది. అమెరికా ఎన్నికల రోజున 69 వేల పైచిలుకు ఉన్న బిట్ కాయిన్ విలువ రెండు సంవత్సరాల క్రితం 17 వేల దిగువకు కూడా పడిపోయింది. ఇక తాజాగా లక్ష డాలర్లు దాటడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ అనుకూల పాలసీలు వస్తాయనే అంచనాలు కూడా బలపడడంతో బిట్ కాయిన్ ఈ రేంజ్ ను దాటింది.
Previous Articleకేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసిన కేరళ ఎంపీల బృందం
Next Article పుష్ప బెనిఫిట్ షో.. మహిళ మృతి