గాజా విషయంలో భారత వైఖరిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. గాజా విషయంలో ఆ సమస్య పరిష్కారానికి 2-స్టేట్ (ద్విదేశ) సిద్ధాంతానికి తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. గాజా విషయంలో చేసే ఏ తీర్మానంలోనైనా హామాస్ బందీలు, ఉగ్రవాదం అంశం ప్రస్తావించాల్సిందేనని లేకపోతే అది వాస్తవిక దృష్టితో చూసినట్లు ఉండదని అన్నారు. మానవీయ చట్టాలకు, హింసకు స్వస్తి పలకడానికి, కాల్పుల విరమణకు భారత్ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని, ప్రజలను బందించడాన్ని భారత్ ఖండిస్తుందని పేర్కొన్నారు. ఎలాంటి తీర్మానాన్ని అయినా అందులో వాడిన పదాలతో సహా భారత్ పరిపక్వతతో చూస్తుందని తెలిపారు. భారత్ ఇజ్రాయెల్ రక్షణా సహాకారం పైనా జై శంకర్ మాట్లాడారు. అవి జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంలో ఇజ్రాయెల్ తో పటిష్ట బంధం ఉందని తెలిపారు. అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ సహాకారం అందించిన దేశం అదని వివరించారు. యూ.ఎన్.ఆర్.ఏ.డబ్ల్యూకు మద్దతు ఇవ్వడంతో పాటు సహాకరించాలని భారత్ నిర్ణయించిందని దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ప్రతి సంవత్సరం 5 మిలియన్ల డాలర్లు సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పాలస్తీనాకు భారత్ నుండి సాయం అందుతుందని 70 మెట్రిక్ టన్నుల సహాయ సామగ్రి, 16.5 మెట్రిక్ టన్నుల మెడిసిన్స్ పంపినట్లు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు