అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘం PDSC డిమాండ్ చేసింది. ఈమేరకు ఒక ప్రకటనలో పేర్కొంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంతో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు, తన కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ షో కు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షో కి వచ్చాడని పేర్కొంది. దీంతో తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం పోవడమే కాకుండా అనేకమంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను 3వేల వరకు పెంచి పేద మధ్యతరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులను గుల్ల చేశారు. సినిమా మీద పెట్టిన పెట్టుబడులను సొమ్ము చేసుకోవడం కోసం, భారీగా లాభాలను ఆర్జించి జనం సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. అభిమానుల భారీ స్పందనతో తొక్కిసలాట జరిగింది. సినిమా వినోదాలను పంచే విధంగా ఉండాలి కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదని పేర్కొంది.
ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు నిరసన, ఆందోళన కార్యక్రమాలకు జనం రాకుండా పరిమితులు విధిస్తూ, అక్రమంగా నాయకులను అరెస్టు చేస్తూ అనేక ఆటంకాలు పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు కల్పిస్తారని జనం గుమికూడుతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్తారు. మరి అర్ధరాత్రి హీరో తన వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలా ఆహ్వానించారో చెప్పాలని ప్రశ్నించారు.
ఆరుగాలం చెమటోడ్చి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పాలకులు పెట్టుబడిదారులు సినిమాలు తీస్తే ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి టికెట్ల రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారు వీరి కపటనీతిని విద్యార్థులు, యువకులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ ఘటనకు కారణమైన అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు