రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష సమావేశం నిర్ణయాలను గవర్నర్ శక్తి కాంత్ దాస్ తెలిపారు. కాగా, కీలక వడ్డీరేట్లకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
వరుసగా 11వ సారి కీలకమైన రెపో రేటును ఆర్.బీ.ఐ యథాతథంగా ఉంచింది.ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రెపో రేటుని పెంచలేదు. 6.5 శాతంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఆరుగురు సభ్యుల కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు.
రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.
ఇక జులై-సెప్టెంబరు క్వార్టర్ లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్టానికి 5.4% కు పడిపోయిందని ఇదే క్వార్టర్ లో గతేడాది జీడీపీ 8.2% గా ఉందని తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు