ఛత్తీస్‌గఢ్ లోని బీజాపుర్ జిల్లాలో జరిగిన ఈ హత్య తాజాగా సంచలనంగా మారింది.బీజాపుర్ జిల్లాకి చెందిన అంగన్వాడీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా చంపారు.CRPF క్యాంపు సమీపంలో ఈ దారుణం జరిగింది.అంగన్వాడీ కార్యకర్త అయిన లక్ష్మీని కొందరు వ్యక్తులు ఇంటి నుంచి బయటకు లాక్కెల్లి హత్య చేయడంతో అంతా షాక్ అయ్యారు.
ఆమెను తీసుకెళ్తున్న సమయంలో తన తల్లిని రక్షించేందుకు వచ్చిన కుమారుడిని దారుణంగా కొట్టారని సమాచారం.అతడి ఎదుటే లక్ష్మిని దారుణంగా హత్య చేశారని తెలుస్తుంది.కాగా ఆమెకు గతంలో నక్సలైట్ల నుండి కొన్ని బెదిరింపులు సైతం వచ్చినట్లు సమాచారం.వారే ఈ హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి కారణం ఆమె పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తుందని నేపంతో హత్య చేసినట్లు తెలుస్తుంది.ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.