బంగ్లాదేశ్‌లోని హిందువుల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉందని,బంగ్లాదేశ్ లో ఎక్కువ మంది దళితులు & ఇతర బలహీన వర్గాలకు చెందిన వారుపై దాడులు జరుగుతున్న కాంగ్రెస్ మాట్లాడం లేదని విమర్శించారు.ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సంభాల్పై నినాదాలు చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ … విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల పొరుగు దేశంలో దళితులు ఇబ్బంది పడుతున్నారని,వారిని భారత్‌కు రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్రాన్ని కోరారు.
విభజన సమయంలో బంగ్లాదేశ్ ను బలవంతంగా పాకిస్తాన్‌కు అప్పగించబడిన హిందూ మెజారిటీ ప్రాంతానికి చెందిన వారిలో దళితులు ఎక్కువగా ఉన్నారని…ఇప్పుడు వారంతా బంగ్లాదేశ్‌లో ఉన్నారని అన్నారు.కాంగ్రెస్ విభజన రాజకీయం,కులతత్వం రాజకీయాలకు సామాన్యులు బలి అవుతున్నారు.కాంగ్రెస్,సమాజ్ వాదీ పార్టీలు రెండు నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.దేశ విభజన కూడా కాంగ్రెస్ పాపమే అని అన్నారు.బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ లో అఘాయిత్యాలకు గురవుతున్న హిందువులను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.