కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీలపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది.కాగా అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందిస్తున్న గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు చేసింది.భారత్ నుండి కశ్మీర్‌ను వేరు చేయాలనే ఆలోచనలకు ఆ సంస్ధ మద్దతిస్తోందని, సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకోవడం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతోందని బీజేపీ పేర్కొంది.దేశాన్ని అస్థిర పరచాలనుకునే సంస్థలకు కాంగ్రెస్ మద్దతిస్తోందని వ్యాఖ్యానించింది.ఈ మేరకు నిన్న సోషల్ మీడియా ఎక్స్ లో బీజేపీ వరుసగా పోస్టులు చేసింది.ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌కు కో-ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా గాంధీ…జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం పొందే సంస్థతో సంబంధాలు పెట్టుకున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది.
కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్లు ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్ ఇంతకుముందే స్పష్టమైన అభిప్రాయాన్ని తెలిపిందని బీజేపీ వ్యాఖ్యానించింది.మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతుండడంతో, జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి దారితీసిందని బీజేపీ వెల్లడించింది.దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి,ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిష్టను … అప్రతిష్ట పాలుచేసేందుకు దేశంలో విపక్ష పార్టీతో సోరోస్ ఫౌండేషన్,మీడియా పోర్టల్ ఓసీసీఆర్‌ఫ్ జతకట్టాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు.ఈ విషయంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తాను పది ప్రశ్నలు అడుగుతానని నిషికాంత్ దూబే చెప్పారు. జార్జ్ సోరోస్ తనకు పాత మిత్రుడు అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బహిరంగంగా అంగీకరించారని నిషికాంత్ దూబే గుర్తు చేశారు.ఇది అందరూ గమనించాల్సిన అంశం అని అన్నారు.

