ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలోని ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. పట్టణానికి చెందిన మన్హర్‌కు కోళ్ల ఫామ్ ఉంది.దాన్ని మరింత పెద్దగా చేయాలని అతడు భావించాడు.అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో బ్యాంకులో లోను తీసుకోవాలని భావించాడు.స్థానిక బ్యాంక్ మేనేజర్‌ను కలవగా..నాటు కోడి లంచంగా ఇవ్వమని కోరాడు.లోన్ కోసం ఆ రైతు మేనేజర్ ఒక కోడిని ఇచ్చాడు.అది మొదలు దాదాపు రూ.39 వేలు విలువ చేసే నాటు కోళ్లను మేనేజర్ లాగించేశాడు.నెలలు గడుస్తున్నా పని జరగకపోవడంతో ఆ రైతు నిరాశకు గురయ్యాడు.పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Previous Articleఏపీ ఈ.ఎస్.ఐ హాస్పిటల్స్ పరిధిలో 13.86 లక్షల మంది
Next Article నాకు ప్రాణహనీ ఉంది:- మంచు మనోజ్

