ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో 13,86,630 మందికి ఈ.ఎస్.ఐ కింద ఆరోగ్య భీమా ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖా సహాయమంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. లోక్ సభలో టీడీపీ ఎంపీలు బైరెడ్డి శబరి, కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతితో కలిపి మొత్తం 560 బెడ్స్ సామర్థ్యంతో ఈ.ఎస్.ఐ హాస్పిటల్స్ మంజూరు చేసినట్లు వివరించారు. 345 బెడ్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ హాస్పిటల్స్ కు 745 పోస్ట్ లు మంజూరు చేయగా 473 పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. విజయనగరంలో 100 బెడ్స్ హాస్పిటల్ 48%, విశాఖపట్నంలో 400 బెడ్స్ హాస్పిటల్ 32% పూర్తయినట్లు వివరించారు. అచ్యుతాపురం లో హాస్పిటల్ ఇంకా టెండర్ల దశలో ఉన్నట్లు తెలిపారు. ఇక ఆయా హాస్పిటల్స్ కు మంజూరు చేసిన నిధులు ఖర్చైన నిధుల వివరాలను వెల్లడించారు.
Previous Articleఏపీ మంత్రి వర్గంలోకి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు
Next Article లోన్ ఇస్తానని.. నాటు కోళ్లు లాగించిన మేనేజర్