నేటితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా డాక్టర్ శక్తికాంతదాస్ పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ గొప్ప వారసత్వాన్ని సొంతం చేసుకున్న సంస్థ అని ఆయన తెలిపారు. ఆర్బీఐలో అధికారులు, సిబ్బందికి మధ్య అద్భుతమైన సమన్వయం ఉందని అన్నారు.మొత్తం ఆర్‌బిఐ బృందానికి ధన్యవాదాలు. విశ్వాసం మరియు విశ్వసనీయత కలిగిన సంస్థగా ఆర్‌బీఐ మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. తన పదవీ కాలంలో అందరూ సహకరించారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కారణంగానే కోవిడ్ సమయంలోనూ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది రాలేదని తెలిపారు. 2018లో ఆర్ బీ ఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్.. పదవీ కాలం 2021లోనే పూర్తి అయింది.అయితే కేంద్రం ఆయన పదవిని మరో మూడేళ్లు పొడిగించింది.ఈ గడువు కూడా నేటితో ముగియనుంది. ఇక నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.గతంలో ఆయనకు రెవెన్యూ శాఖ కార్యదర్శి గా వర్క్ చేసిన అనుభవం వుంది.రేపటి నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.మూడేళ్ల పాటు ఆయన ఈ అధికారాలు కలిగి ఉంటారు.
Previous Articleఏపీ డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపులు: పోలీసుల అదుపులో నిందితుడు
Next Article మందకొడిగా ట్రేడింగ్ ముగించిన సూచీలు