మీడియా వ్యక్తి పై చేయి చేసుకున్నందుకు చింతిస్తున్నాను అని నటుడు మోహన్ బాబు అన్నారు.తాను ఎన్ని సేవా కార్యక్రమాలు చేశానని ఈరోజు తాను చేసిన సేవలను పక్కన పెట్టేసి.. కొట్టిన విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించడం ఏం బాలేదని తెలిపారు.తాను ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోవాలని అన్నారు.తన కుటుంబ విషయాల్లో బయటవల్లు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఈ సమస్యలు ఎదో ఒక రోజు తప్పకుండా సద్దుమనుకుతాయని అన్నారు.మోహన్బాబు కుటుంబంలో ఆస్తి విషయంలో తగాదాలు నెలకొన్న విషయం తెలిసింది.మంగళవారం జలపల్లి లోని మోహన్ బాబు నివాసంలో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.వివాదంలో భాగంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన ఒక విలేకరి పై ఆయన మైక్ తో దాడి చేశారు.అనంతరం ఆయన హాస్పిటల్ లో చేరారు. ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు