ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచిన సందర్భంగా కూటమి పాలనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. కూటమి అర్ధ సంవత్సర పాలన పూర్తిగా “అర్ధ రహితం” అని విమర్శలు గుప్పించారు. 6 నెలల్లో ఇచ్చిన 6 సూపర్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో పెట్టిన 60 హామీలు పత్తాకు లేవు. మూడు సిలిండర్లలో ఈ ఏడాది సింగిల్ సిలిండర్ తో మమ అనిపించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
3 వేల నిరుద్యోగ భృతి,20 లక్షల ఉద్యోగాలు, స్కూల్ కి వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు, రైతుకి 20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవ, ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత ఇసుక పథకం ఇలా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకు సంబంధించి ‘ఎక్స్’ లో విమర్శలు గుప్పించారు. వచ్చిన 6 నెలల్లోనే 17500 కోట్ల రూపాయలు జనం నెత్తిన వేశారని దుయ్యబట్టారు.
ఇచ్చిన హామీలు సంగతి ఏంటి అని అడిగితే.. చంద్రబాబు గారు ఇప్పటికీ చెప్తున్న సమాధానం..రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది.. వైసిపి వాళ్ళు 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. గాడిలో పెట్టాలి అంటున్నారు. నిజమే వైసిపి 5 ఏళ్ల పాలన దోపిడీ పాలన. దొంగల పాలన. నేల, నీరు, ఖనిజం , ఒకటేంటి..కన్ను పడిందల్లా కాజేశారు. వాళ్ళు తిన్నారు కాబట్టే…జనాలు బుద్ధి చెప్పారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీరేదో ఉద్దరిస్తారని మీకు పట్టం కడితే మీరు చేసేది ఏంటి ? ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాలని సూచించారు.
మీరేదో ఉద్దరిస్తారని మీకు పట్టం కడితే మీరు చేసేది ఏంటి: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Articleఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ
Next Article స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ