పంజాబ్-హార్యానా సరిహద్దు ప్రాంతమైన శంభు దగ్గర రైతులు మరోసారి ఢిల్లీ చలో మార్చ్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. రైతులు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం ఈ మార్చ్ చేస్తూన్నారు. రైతుల మార్చ్ ను దృష్టిలో ఉంచుకుని హార్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఈరోజు ఉదయం నుండి ఈనెల 17 అర్థరాత్రి వరకు నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 6 నుండి రైతులు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈరోజుతో కలిపి మూడు సార్లు పోలీసులు వారి ప్రయత్నాలు భగ్నం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు