అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ షాక్ తగిలింది.పోర్న్ స్టార్‌కు హష్ మనీ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు అంగీకరించలేదు.అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్‌హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ తెలిపారు.ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో ట్రంప్‌నకు రక్షణ వర్తించదని స్పష్టం చేశారు.హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే.ఈ ఏడాది నవంబరులో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేసే సయమంలో ఆయన అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ ఆయన న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు.దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది.తాజాగా ట్రంప్‌నకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది.ఒక వేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే…శిక్ష అభియోగాలను ఎదుర్కొంటూ శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు