క్యాన్సర్ రోగంతో పీడించబడుతున్న ప్రపంచానికి రష్య శుభవార్త తెలిపింది.క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నట్టు వెల్లడించింది.ముందుగా ఆ దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వబోతున్నట్టు పేర్కొంది.ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.జనవరి 2025 నుండి రష్యన్ పౌరులకు ఇవ్వబోతున్నట్టు చెప్పారు.రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS ప్రకారం రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ టీకా గురించి వెల్లడించారు.
రష్యా రాజధాని మాస్కో నగరంలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ TASSతో మాట్లాడుతూ…క్యాన్సర్ పెరుగుదలను వ్యాక్సిన్ ఆపగలదని చెప్పారు.క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలదని పేర్కొన్నారు.ఈ వ్యాక్సిన్‌ను క్యాన్సర్‌ను నివారించడానికి సాధారణ ప్రజలకు ఇవ్వకుండా క్యాన్సర్ రోగులకు చికిత్స చేయడానికి వినియోగిస్తామని తెలిపారు.ఈ వ్యాక్సిన్‌ను అన్ని రకాల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఇవ్వవచ్చు అని అన్నారు.