రైతులు వ్యవసాయ పనుల్లో క్రిమిసంహారక మందులను వాడేటప్పుడు హానికారక రసాయనాల ప్రభావానికి గురికాకుండా ఉండే విధంగా రూపకల్పన చేసిన ‘కిసాన్ కవచ్’ అనబడే క్రిమిసంహారక మందుల నిరోధక బాడీసూట్ ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. కిసాన్ కవచ్ మొదటి బ్యాచ్ దుస్తుల్ని కొంతమంది రైతులకు పంపిణీ చేశారు. రైతుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఈ ప్రత్యేక దుస్తులు రక్షణనిస్తాయి. దీని అత్యంత అధునాతన ఫ్యాబ్రిక్ టెక్నాలజీ క్రిమిసంహారక మందుల ప్రభావాన్ని డీయాక్టివేట్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో, బెంగళూరుకు చెందిన ‘బ్రిక్-ఇన్- స్టెమ్’, సిపియో హెల్త్ ప్రై.లిమిటెడ్ లు సంయుక్తంగా వీటిని రూపొందించాయి. ఈ ‘కిసాన్ కవచ్’ దుస్తుల ధర రూ.4,000గా ఉంది అయితే వీటిని ఉతికి శుభ్రం చేసుకొని మాములుగానే పునర్వినియోగించుకోవచ్చు.
క్రిమిసంహారక మందుల ప్రభావం నుండి రైతులకు రక్షణ ఇచ్చే ‘కిసాన్ కవచ్’
By admin1 Min Read
Previous Articleకాంగ్రెస్ ఆ వ్యాఖ్యలు వక్రీకరించింది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Next Article కేరళ రాష్ట్రంలో ‘మంకీపాక్స్’ కలకలం