బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కోస్తా తీరం వైపుగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు వెళ్తుందని, ఆ తర్వాత కోస్తా తీరం వెంబడి కదులుతుందని వివరించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలకు తోడు తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కావున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
By admin1 Min Read
Previous Articleమాజీ మంత్రి పరిటాల హత్య కేసు ముద్దాయిలకు బెయిల్…!
Next Article జానపద కళాకారుడు ‘బలగం’ నటుడు మొగిలయ్య కన్నుమూత