గత వైసీపీ ప్రభుత్వం పాలన వల్ల ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాళా అంచున ఉందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీ.వీ.రెడ్డి విమర్శించారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మకు అప్పటి అధికారులు అక్రమంగా రూ.2.10కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు పొందాలనేదే లక్ష్యంగా 2016లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారని తెలిపారు. 2019 నాటికి 24వేల కి.మీ కేబుల్ వేసి 10లక్షల కనెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు. అయితే నేడు ఆ సంఖ్య 5లక్షలకు పడిపోయిందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను వేధింపులకు గురిచేసిందని అప్పటి ఎండీ మధుసూదన్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక దస్త్రాలు మార్చేశారు. కీలక డాక్యుమెంట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ మహిళా ఉద్యోగి చేరవేశారని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. అనవసర ఖర్చులు తగ్గించుకుని నిధులు సమీకరించుకుంటాం. ‘వ్యూహం’ సినిమాను ఫైబర్నెట్లో టెలికాస్ట్ చేసి అక్రమంగా దర్శకుడు రాంగోపాల్ వర్మకి చెల్లింపులు చేశారని మండిపడ్డారు. ఎక్కడా లేనివిధంగా అప్పటి అధికారులు వ్యవహరించారని ఆక్షేపించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు