ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ శకంగా పిలువబడుతోంది. ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతోంది. ఇక
ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రజాదరణ పొందిన ఓపెన్ ఏఐ-చాట్ జీపీటీ చాట్ బోట్ మరింత అందుబాటులోకి రానుంది. వాట్సాప్ లో కూడా చాట్ జీపీటీ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఓపెన్ఏఐ అందుబాటులోకి తెచ్చింది. +18002428478 నంబర్ తో వాట్సాప్ లో చాట్ చేయొచ్చు. మన ప్రశ్నలకు చాటి జీపీటీ సమాధానాలు ఇస్తుంది. భారత్ లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఇదే నంబర్కు కాల్ చేసి కూడా ఈ సేవలు పొందవచ్చు. అయితే, ప్రస్తుతానికి కాల్ సదుపాయం కేవలం అమెరికా, కెనడాకు మాత్రమే పరిమితమై ఉంది. ప్రస్తుతం చాటీపీటీ వాడేందుకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సప్ లో అయితే ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు. కానీ రోజువారీ వాడుకపై పరిమితి ఉంటుంది. భవిష్యత్తులో చాటీజీపీటీ సెర్చ్, ఇమేజ్ బెస్ట్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సదుపాయాలు కూడా రానున్నట్లు తెలుస్తోంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

