వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను నియమించారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోరంట్ల మాధవ్ ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి పెట్టిన గత కొన్ని రోజులుగా జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రాకముందు అనంతపురం జిల్లాలో పోలీస్ అధికారి (సీఐ)గా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు