తిరుమల కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసిన సహించేది లేదని టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు హెచ్చరించారు. దీనిపై ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు. తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదేలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
Previous Articleవైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
Next Article పాక్ క్షిపణులతో మా దేశానికీ ముప్పే: అమెరికా