ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా మధుమూర్తి నియమితులయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈపదవిలో కొనసాగనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు.