ప్రతియేటా గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో జరిగే సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమం ‘రణ్ ఉత్సవ్’. ఈ ఏడాది డిసెంబర్1నుండి ప్రారంభమైన ‘రణ ఉత్సవ్’ 2025, ఫిబ్రవరి 28 వరకు జరగనుంది. అతి సుందరమైన కచ్ ప్రాంతంలోని ధోర్డో గ్రామంలో ప్రతియేటా ఘనంగా రణ్ ఉత్సవాన్ని నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో గుజరాత్ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది.
రణ్ ఉత్సవ్ సందర్భంగా సందర్శకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా కచ్ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘ధోర్డో విలేజ్’ అంటే గుడారాల గ్రామంలో అత్యాధునిక సౌకర్యాలతో కచ్ ప్రాంత గ్రామీణ వాతావరణం, అక్కడ సంస్కృతి, కళలకు అద్దంపట్టేలా తాత్కాలిక నిర్మాణాలను టెంట్ సిటీ పేరుతో ఏర్పాటు చేశారు.
ఇక ఈ ఉత్సవంలో గుజరాతీ, రాజస్థానీ, మరియు ఇతర భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు, గర్బా, దాండియా సహా పలు జానపద నృత్యాలు, సంగీత కళలు , హస్తకళలు అక్కడి గ్రామీణ జీవనశైలికి నిర్మాణ శైలికి దర్పం పట్టే నమూనాలు ప్రదర్శించబడతాయి.
ప్రతి సంవత్సరం అనేక దేశాల నుండి విదేశీ పర్యాటకులతో పాటు దాదాపు పది లక్షల మందికి పైగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఈ రణ్ ఉత్సవ్ ను సందర్శిస్తుంటారు.
कच्छ की परंपरा, संस्कृति और विरासत का प्रतीक रण उत्सव हर किसी का मन मोह लेने वाला है। अद्भुत क्राफ्ट बाजार हो, सांस्कृतिक कार्यक्रम या फिर खान-पान की परंपरा, यहां का आपका हर अनुभव अविस्मरणीय बन जाएगा। आप सभी से मेरा आग्रह है कि एक बार अपने परिवार के साथ इस रण उत्सव में जरूर आएं। pic.twitter.com/df1ewGi8Sr
— Narendra Modi (@narendramodi) December 21, 2024

