నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం తెలిపారు. అలాగే సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ షడంగి నియమించబడ్డారు. జస్టిస్ మిశ్రా ఇదివరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన ఈ ఏడాది జూన్ 1న పదవీవిరమణ చేశారు. తరువాత తాత్కాలిక ఛైర్ పర్సన్ గా ఎన్.హెచ్.ఆర్.సీ సభ్యురాలు విజయభారతీ సయానీ కొనసాగారు. కొత్త ఛైర్ పర్సన్ ఎంపికై ఈనెల 18న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ ను నియమిస్తూ తాజాగా నిర్ణయం వెలువడింది.
ఎన్.హెచ్.ఆర్.సీ ఛైర్ పర్సన్ గా నియమితులైన జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్
By admin1 Min Read
Previous Articleతక్షణమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలి: ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్…!