Author: admin

ఎదుటివారికి, సమాజానికి సేవ చేయడం అనేది మన సంస్కృతిలో భాగం. అందుకే మనది పుణ్యభూమి అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. “పరోపకారం పరమో ధర్మః” అనేది మన భారతీయ ధర్మం. మనం బాగుండాలి.. మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు “జన్మభూమి” కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో నేడు “జీరో పావర్టీ – పీ4” కార్యక్రమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు. దీనికి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు. ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇలాంటి భూరి విరాళాలు టీటీడీ చేపట్టే విద్యా, వైద్యం వంటి సేవలకు ఎంతో ఉపకరిస్తుంది. ఎన్నో సత్కార్యాలకు దోహద పడుతుందని చెప్పారు. డబ్బు సంపాదన కంటే…దాన్ని తిరిగి సమాజంపై ఖర్చు చేయడమే ఎక్కువ తృప్తిని, నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అనడంలో సందేహం…

Read More

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రోజు ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. సీఎం సెక్యూరిటీ బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుండి స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. బుధవారం సీఎం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో “జన్ సున్వాయ్” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రేఖా గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దాడికి పాల్పడిన దుండగుడు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు… పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనను ఢిల్లీ బీజేపీ తీవ్రంగా ఖండించింది.

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుసంధానం చేసేందుకు రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో ఎర్రుబాలెం – అమరావతి -నంబూరు మధ్య 57 కిలోమీటర్ల రైల్వే మార్గం నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటలో తెలిపారు. దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా భావించి భూ సేకరణ ప్రారంభించినట్లు తెలిపారు. దీని కోసం రూ.171 కోట్లు 2025-26 బడ్జెట్ లో కేటాయించినట్లు పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈమేరకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. ఇంకా ఏపీలో జరుగుతున్న పలు రైలు ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 గణాంకాల ప్రకారం 27 డబ్బింగ్, 12 కొత్త లైన్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు.

Read More

రాష్ట్రంలో ఆక్వా రంగానికి అన్ని విధాల అండగా నిలుస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఉండవల్లి నివాసంలో ఆక్వా కల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. రష్యా, యూరోపియన్ యూనియన్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆక్వా ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, రైతులు, ఫీడ్ కంపెనీ, హేచరీస్ యజమానులు సలహాలు, సూచనలు అందించారు. సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే కేంద్రానికి నివేదిస్తామని లోకేష్ తెలిపారు.

Read More

సీనియర్ అగ్ర కధానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ వంటి విజయవంతమైన చిత్రంతో ఆకట్టుకున్న వశిష్ట ఈ భారీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష, ఆషిక రంగనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రం ఎందుకు లేట్ అవుతుంది వంటి అంశాలను అందులో వివరించారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్యుత్తమంగా ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది.ఈ సినిమాను 2026 సమ్మర్ లో ఎంజాయ్ చేయండని ఆ వీడియోలో…

Read More

భారత్ ఎప్పటికప్పుడు తన ఆయుధ సంపత్తిని మెరుగుపరుచుకుంటూ రక్షణా పరంగా శత్రు దుర్భేద్యంగా దూసుకెళ్తోంది. తాజాగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైల్ అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ టెస్టు చేపట్టినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. స్ట్రాటెజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో అగ్ని-5 మిస్సైల్ అన్ని టెక్నికల్, కార్యచరణ రేంజ్ లను అందుకున్నట్టు ప్రకటించాయి. అగ్ని-5 అనేది డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి. భారత్‌ వద్ద ఉన్న అగ్ని శ్రేణిలో ఇది అత్యంత అధునాతన మిస్సైల్‌. ఇది 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా తేలికగా ఛేదించగలదు.

Read More

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఈరోజు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు మంత్రుల సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను రాధాకృష్ణన్ సమర్పించారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాలుగు సెట్ల పేపర్లు దాఖలు చేశారు. మొదటి సెట్‌ కు చీఫ్ ప్రపోజర్‌గా ప్రధాని ఉన్నారు. నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు సీపీ రాధాకృష్ణన్ ప్రేరణా స్థల్‌ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. సీపీ రాధాకృష్ణన్ విజయంపై ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేసారు. ఆ పదవికి రాధాకృష్ణన్ వన్నెతెస్తారని, దేశం మరింత అభివృద్ధి పథంలోకి వెళ్తుందని ఈసందర్భంగా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More

లోక్‌ సభలో ఈరోజు ‘ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లు – 2025’ను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య కేంద్రం బిల్లు ప్రవేశపెట్టింది. ఈ – స్పోర్ట్స్‌, సోషల్‌ గేమ్స్‌ కు ప్రోత్సాహం, ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌‌పై నిషేధం విధిస్తారు. అలాగే యువత, కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజిక ముప్పుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకు వస్తున్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ లతో పలు మోసపూరిత వ్యవహారాలు పెద్దసంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. వాటిని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులు పై కూడా దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో నేడు (ఆగస్టు 20న) లోక్‌సభ ఎదుటకు ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025ను తీసుకువచ్చారు.

Read More

ఆవిష్కరణలకు వనరులు అడ్డంకి కాదని, వినూత్నమైన ఆలోచనలే ముఖ్యమని, ప్రతి యువకుడు విద్యార్థి దశ నుంచే మెరుపులాంటి ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని మానవాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఇన్నొవేషన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీని తీర్చిదిద్దేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసందర్భంగా చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆశయమని అన్నారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని ముందుకు సాగుదాం. ఆవిష్కర్తలకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.

Read More

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ‘అనర్హత’ బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకిస్తున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులు ఎవరైనా వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే వారి పదవిని రద్దు చేసే నిబంధన ఈ బిల్లుల సారాంశం. లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ, 30 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగుతారు? ఇది చాలా సాధారణమైన విషయం. ఇందులో నాకు పెద్దగా తప్పేమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా తప్పు చేస్తే మంత్రి పదవిలో ఉండకూడదన్నది చాలా సరైన విషయమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇంకా బిల్లును తాను పూర్తిగా చదవలేదని, తన ఈ అభిప్రాయమే చివరిది కాదని ఈమేరకు స్పష్టం చేశారు. ఈ బిల్లుపై…

Read More