ఈరోజు లోక్‌సభ ముందుకు కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈబిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలందరికీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాల ఆందోళన చేస్తున్నాయి. నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసన కల్పించేలా కొత్త బిల్లు. అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే పదవి నుంచి ఉద్వాసన పలికే విధంగా రూపొందించబడింది. ప్రధాని, కేంద్రమంత్రి, సీఎం ఇలా ఎవరినైనా తొలగించేలా కొత్త బిల్లు తీసుకొచ్చారు.
Author: admin
మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణలను చంద్రబాబు తిలకించారు. పేరుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అయినప్పటికీ టాటా గ్రూప్ నాయకత్వంలో ఎల్ & టీ, జె ఎస్ డబ్ల్యూ, అదానీ, గ్రీన్ కో, జిఎంఆర్, కియా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ హబ్ లో భాగస్వామ్యం అవుతున్నాయి. అదేవిధంగా అమరావతిలోని ఈ హబ్ కు అనుబంధంగా రాష్ట్రంలో మరో ఐదు విభాగాలు ఏర్పాటు అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏళ్లుగా ఐటి అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని తాము చూస్తున్నామని అప్పుడూ ఆయనతో కలిసి పని చేసాం, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా ఆయనతో కలిసి పని చేస్తున్నాం. చంద్రబాబు గారి విజన్‌కి తోడుగా, టాటా గ్రూప్ ఉండటం సంతోషమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్…
వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ కు భారత జట్టును ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీ సెప్టెంబరు 9న ప్రారంభమవుతుంది. పాకిస్థాన్, ఒమన్, యూఏఈతో పాటు భారత్ గ్రూప్-ఎలో ఉంది. సెప్టెంబరు 28న ఆసియాకప్ ఫైనల్ జరుగనుంది. వెస్టిండీస్ లో భారత్ తొలి టెస్టు అక్టోబరు 2న అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. భారత జట్టు: సూర్యకుమార్, శుభ్ మాన్ గిల్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, జితేశ్ శర్మ, శివమ్ దూబె, అర్ష్ దీప్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్. స్టాండ్ బై: ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైశ్వాల్.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై ఒక దుండగుడు దాడికి పాల్పడ్డాడు. తన అధికారిక నివాసంలో “జన్ సున్వాయ్” కార్యక్రమం ఢిల్లీ సీఎం రేఖ గుప్తా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దాడికి పాల్పడిన దుండగుడు సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేశాడు… పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనను ఢిల్లీ బీజేపీ తీవ్రంగా ఖండించింది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో భారీ ప్రాజెక్ట్ కు సన్నద్ధమవుతోంది. 40 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు భారీ రాకెట్ ను నిర్మించే పనిలో నిమగ్నమైనట్లు ఇస్రో చైర్మన్ వి.నిరాయణన్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కాన్వకేషన్ కు హాజరైన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది నావిక్ శాటిలైట్, ఎన్1 రాకెట్ ప్రయోగం, అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యునికేషన్ శాటిలైట్ ను కక్ష్యలోకి చేర్చడం వంటి ప్రాజెక్టులు చేపట్టనుందన్నారు. అబ్దుల్ కలామ్ గారు తయారు చేసిన తొలిరాకెట్ 17 టన్నుల లిఫ్ట్ బరువుతో.. 35 కిలోల ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్యకు చేర్చింది. కానీ, నేడు 75,000 కిలోల బరువైన పేలోడ్‌ను దిగువ భూకక్ష్యకు చేర్చడంపై పనిచేస్తున్నామని వివరించారు. అందుకు అవసరమైన రాకెట్ 40 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం భారత్ కు కక్ష్యలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే…
భారతీయ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్ష అనుభవాలు భారత్ చేపట్టనున్న ‘గగన్ యాన్’ ప్రాజెక్టుకు చాలా అవసరమని ప్రధాని మోడీ అన్నారు. ఇటీవలే అంతరిక్ష యాత్ర చేసి తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శుభాంశు శుక్లాను అభినందించారు. 2040లోపు మనం మరో 40 నుంచి 50 మంది ఆస్ట్రోనాట్ లను తయారుచేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. భారత్ చేపట్టబోయే గగన్ యాన్ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని దీనిలో భాగం కావడానికి అనేకమంది శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారని శుక్లా ప్రధానికి తెలిపారు. ప్రధాని మోడీతో జరిగిన భేటీకి సంబంధించి శుక్లా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ప్రధాని మాట్లాడుతూ.. గగన్ యాన్ ప్రాజెక్టుకు శుంభాంశు అంతరిక్ష యాత్రతో తొలి అడుగు పడిందన్నారు. భారత్ చేపడుతున్న అంతరిక్ష సంస్కరణలకు, ఆశయాలకు సహాయకారిగా ఉంటుందని మోడీ శుక్లాతో అన్నారు. 2047 నాటికి…
పేదరికాన్ని సమూలంగా, శాశ్వతంగా నిర్మూలించాలనే మంచి లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పీ4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈరోజు జరిగిన పీ4 అమలు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మొదటి దశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్గదర్శుల ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. పీ4 సంబంధిత మార్గదర్శులతో ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈరోజు పీ4 పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పీ4 చాలామంది జీవితాల్లో గొప్పమార్పు అవుతుందని స్పష్టం చేశారు. ఇంటర్ పాస్ అయిన అమ్మాయికి రెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి నెలలో ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించామని వివరించారు. ఆ అమ్మాయి భవిష్యత్తులో మార్గదర్శి కావాలని కోరుకుంటుందని తెలిపారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మంథన, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘థామా’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈసినిమా నుంచి టీజర్ ను విడుదలైంది. ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మాడ్‌డాక్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. https://youtu.be/hSBwq8yrXf0?si=uG7qdw4oRU-uCNu8
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటింది. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 35 – 45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి వాతావరణం లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ బోణీ కొట్టింది. పురుషుల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అన్మోల్ (580), ఆదిత్య మాల్రా (579), సౌరభ్ చౌదరి (576)లతో కూడిన భారత జట్టు 1735 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా (1744) గోల్డ్ మెడల్ సాధించింది. ఇరాన్ (1733) కాంస్యాన్ని కైవసం చేసుకుంది. పురుషుల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అన్మోల్ ఆరో స్థానంలో నిలిచాడు. ఆదిత్య (579), సౌరభ్ చౌదం (576) క్వాలిఫికేషన్లోనే వెనుదిరిగారు. 20 ఏళ్ల అమిత్శర్మ క్వాలిఫికేషన్లో 588 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కపిల్ పసిడి గెలిచాడు. ఫైనల్లో 243 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో మరో భారత్ కు చెందిన గవిన్ ఆంథోని (220.7) కాంస్యం గెలుచుకున్నాడు.