దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాలి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీయ సూచీలు జోరు కనబరిచాయి. ఫార్మా, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్ తదితర రంగాల్లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 226 పాయింట్ల నష్టంతో 78,699 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 63 పాయింట్ల లాభంతో 23,813 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.52గా కొనసాగుతోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా 2025
Next Article అల్లు అర్జున్ తో నన్ను పోల్చొద్దు: అమితాబ్ బచ్చన్