ప్రపంచ సంపన్నుడు స్పేస్ ఎక్స్ టెస్లా వంటి మేటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్ 108 మిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లను కొన్ని ఛారిటీలకు విరాళంగా ఇచ్చారు. రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా టెస్లా ఈమేరకు తెలిపింది. టెస్లాలో ఎలాన్ మస్క్ కు 12 శాతానికి పైగా వాటాలు న్నాయి. అందులో నుండి 2,68,000 షేర్లు ఆయన ఛారిటీ కోసం ఇచ్చి తన దాతృత్వం చాటుకున్నారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.
మస్క్ ఇంతకుముందు కూడా పలు ఛారిటీలు చేసిన సంగతి తెలిసిందే. 2021 లో కూడా తను అధ్యక్షుడిగా ఉన్న మస్క్ ఫౌండేషన్ కోసం 5.74 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మంచి దాతృత్వ కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ చేస్తుంది.
Previous Articleఎపి-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
Next Article నేటి ట్రేడింగ్ లో తగ్గిన సూచీల జోరు..!