ఎక్కువ రోజుల పాటు సిమ్ కార్డును రీఛార్జి చేసుకోకుండా వినియోగించకుండా ఉంటే అది రద్దై వేరేవారికి కేటాయించబడుతుంది. పెరిగిన ధరలతో ఇలా ఎంతోమంది వారి వద్ద ఉన్న కొన్ని నెంబర్లను వదిలేసుకుని ఉంటారు. అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తీసుకొచ్చిన నిబంధనలతో మీ సిమ్ కార్డ్ ను నెలకు రూ 20 తో రీఛార్జి చేసుకుని మీరు వినియోగించుకోవచ్చు. ఎంతోమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు 90 రోజుల పాటు మీ సిమ్ ను వాడకుండా ఉంటే మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుండి రూ.20 కట్ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.20తో రీఛార్జి చేసుకుంటే మీ సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (వి.ఐ), బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో మీ ఖాతాలో రూ.20తో రీఛార్జి చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ సిమ్ కోల్పోవాల్సి వస్తుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు