ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.నేడు గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.దీంతో జనవరి 19 రాత్రి నుంచి పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 14కి చేరిందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ రహిత భారత్ దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొని ఊపిరితో ఉందన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇది నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ. మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక ముందడుగని అన్నారు. సీ.ఆర్.పీ.ఎఫ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ కు చెందిన బలగాలు ఈ జాయింట్ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు అమిత్ షా స్పందించారు.
నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక ముందడుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
By admin1 Min Read
Previous Articleప్రతినెలా రూ.20తో మీ సిమ్ కార్డు నిలుపుకోండి..!
Next Article తగ్గిన సూచీల జోరు..76 వేల దిగువకు సెన్సెక్స్