దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ను స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఉదయం ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఆటో మొబైల్, ఐటీ షేర్లు రాణించడంతో లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడి 76,520 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 23,205 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.44గా కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ లో అల్ట్రా టెక్, జొమాటో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ
Next Article ఆటోడ్రైవర్‌కు రివార్డు ప్రకటించిన సింగర్