దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుండి కోలుకుని తిరిగి లాభాలు ఆర్జించాయి. , మరికొన్ని గంటల్లోనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లకు సంబంధించిన కీలక నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు రాణించడం గమనార్హం. మన దేశ కాలమానం ప్రకారం నేడు అర్థరాత్రి 1:30 తరువాత ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. వెంటనే టారిఫ్ లు అమలులోకి రానున్నాయని వైట్ హౌస్ తెలిపింది. ఇక నేడు బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో 76,617 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 166 పాయింట్లు లాభపడి 23,332 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.48గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో టైటాన్, జొమాటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
మరికొన్ని గంటల్లో టారిఫ్ ల ప్రకటన… లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
By admin1 Min Read
Previous Articleసీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తా: ఎమ్మెల్సీ నాగబాబు
Next Article టీటీడీపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష..!