కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా రెండోసారి సవరించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఇక రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో 6.25 నుండి 6 శాతానికి రెపో రేటు తగ్గింది. దీంతో హోమ్, వెహికల్, పర్సనల్ లోన్స్ పై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. కాగా, ఫిబ్రవరిలో కూడా వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశీయంగా ద్రవ్యోల్బణం కంట్రోల్ ఫేజ్ లోనే ఉంది. 2025 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడం కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ క్రమంలోనే బలహీనంగా ఉన్న ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు