Hyundai IPO listing : హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా పేరొందిన హ్యుందాయ్.. మదుపర్లకు నష్టాల్ని మిగిల్చింది.
దేశంలోనే అతిపెద్ద ఇష్యూగా పేరొందిన హ్యుందాయ్ మోటార్ ఐపీఓ మంగళవారం స్టాక్ మార్కెట్లో ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యింది. ఇష్యూ ప్రైజ్‌తో (రూ.1960) పోల్చితే, బీఎస్ఈలో ఈ హ్యుందాయ్ స్టాక్ రూ. 26 నష్టంతో 1934 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 29 నష్టంతో 1931 వద్ద లిస్ట్ అయ్యింది. అంటే మదుపర్లకు ఈ ఐపీఓ 1.3శాతం నష్టాన్ని మిగిల్చినట్టు!