నేటి ట్రేడింగ్ లో కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయాలు రానున్న నేపథ్యంలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాన రంగాల షేర్లు సూచీలకు మద్దతుగా నిలివలేదు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 502 పాయింట్ల నష్టంతో 80,182 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 137 పాయింట్ల నష్టంతో 24,198 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.90గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీ.సీ.ఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleరష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మృతి: సోషల్ మీడియాలో వీడియో వైరల్
Next Article శ్రీతేజను పరామర్శించిన అల్లు అరవింద్…!