రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మరణించారు. స్కూటర్ బాంబు పేలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తన నివాసం నుండి బయటకు అడుగుపెడుతుండగా బాంబు పేలింది. దీంతో కిరిల్లోవ్ తో పాటు ఆయన సహాయకుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇగోర్ కిరిల్లోవ్ ను తామే హత్య చేసినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. తమ భూభాగంపై నిషేధిత రసాయనిక ఆయుధాల ప్రయోగానికి కిరిల్లోవ్ అనుమతించారని ఆరోపించాయి. ఇందుకు ప్రతీకారంగానే ఆయనపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Video footage has emerged showing the moment General Igor Kirillov, who was in charge of Russia’s nuclear protection forces, was killed in an explosion that a source in Ukraine’s security service says the service was responsible for. pic.twitter.com/qGkom5rMli
— Al Jazeera English (@AJEnglish) December 17, 2024