కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈరోజు 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో వస్తు సేవల పన్నుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఇక పాలసీ (భీమా) పై జీ.ఎస్.టీ మినహాయింపు సహా పలు అంశాలపై నిర్ణయాలు వాయిదా పడ్డాయి. ఏ.టీ.ఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ )ను జీ.ఎస్.టీ పరిధిలోకి తీసుకురావడానికి ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సమావేశం నిర్ణయాలను ఆమె మీడియాకు తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లపై జీ.ఎస్.టీ మినహాయింపు అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఐ.ఆర్.డి.ఏఐ సహా మరికొన్ని ఇన్ పుట్స్ రావాల్సిన అవసరం ఉందని వివరించారు.
జీ.ఎస్.టీ కౌన్సిల్ నిర్ణయాలు:
రూ.2 వేల లోపు చెల్లింపులు చేసే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుండి మినహాయిపు. పేమెంట్ గేట్వేలకు, ఫిన్ టెక్ సంస్థలకు వర్తించదు.
ఫోర్ట్ ఫైడ్ బియ్యం గింజలపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
జన్యు చికిత్సలకు జీఎస్టీ మినహాయింపు
రుణ గ్రహీతలపై బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సిలు వేసే జరిమానాలపై జీఎస్టీ తొలగింపు
పరిహార సెస్సుకు సంబందించి ఏర్పాటైన మంత్రుల బృందానికి నివేదిక సమర్పించడానికి మరింత గడువు
రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి నివేదిక పూర్తి కాకపోవడంతో ప్యానెల్ కు మరింత గడువు
ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం లు అయిన స్విగ్గీ, జొమాటోపై పన్ను రేట్లపై నిర్ణయం వాయిదా
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు