2024 డిసెంబర్ 31న ఉదయం సీఎం పల్నాడు జిల్లా పర్యటనలో ఉల్లంగుల ఏడుకొండలుకు ఇంటి వద్దే పింఛను అందజేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సందర్భంగా ఏడుకొండలు కుటుంబ పరిస్థితులపై ఆరా తీసారు. గాలి మిషన్ ద్వారా వాహన టైర్లకు గాలి నింపి జీవనం సాగిస్తున్నానని, ప్రస్తుతం గాలి మిషన్ పాడై ఆదాయం ఇబ్బందిగా మారిందని ఏడుకొండలు సీయం దృష్టికి తీసుకురాగా.. దీనిపై ఏడుకొండలుకు వెంటనే నూతన గాలి మిషన్ అందజేయాలని కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు, 24 గంటల్లోనే ఏడుకొండలుకు కొత్త గాలి మిషన్ను కలెక్టర్ అందజేశారు.
Previous Articleనూతనత్వం, సాంకేతికత జోడిస్తే వివిధ శాఖల్లో అద్బుత ఫలితాలు
Next Article ఆంటోనీ తో ప్రేమ..అలా మొదలైంది : కీర్తి సురేష్